నిడివి చూడక అడుగులేయవే
దాదాపు రెండేళ్ల తర్వాత నిను చూస్తున్నాను
నా ఆనందాన్ని నీతో పంచుకోవాలనుంది, కానీ నిను చూస్తుంటే
అక్షరాలు కరువౌతున్నాయి
పదాలు కనుమరుగౌతున్నాయి
గాత్రాలు మూగబోతున్నాయి
నేత్రాలు మసకబారుతున్నాయి
ఎంతసేపని అల్లంతదూరాన ఆగిపోతావ్
నిడివి చూడక అడుగులేయవే
నడక నేర్చిన నెలబాలిక
సొగసు వీడిక, సరసచేరవే
సొట్టబుగ్గల సిరిచందన