నీ కోసం అణిచిన అక్షరాలు
మహీప్రాచీరపు అగాధము నుండి శిఖరాగ్రాపు కొనల వరకు అన్వేషించాను నీకేమి ఇవ్వగలనని కానీ భూతలస్వర్గాన్ని కేవలం ఆస్వాదించాలి గాని సంతృప్తిపరచాలనుకోవడం మూర్ఖత్వమని ఆలస్యంగా గ్రహించాను.
నా స్వీయచరిత్రలో నీకంటూ ఉన్న పేజీ లెన్నో, అందులో నీ అనుభవాలెన్నో
ఒక్కో అనుభవం ఒక్కో అద్భుతం, ప్రతి అద్భుతం నా జీవితం
అగమ్యగోచరంలో నా గమ్యనివయ్యావు, నిశీధిలో నా వెలుగువయ్యావు ఈ స్వల్ప జీవితంలో నువ్వు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.